తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం..48 గంటల డెడ్ లైన్

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు [more]

;

Update: 2021-04-20 00:36 GMT

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా హాల్ లు, పబ్బులు బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఇవ్వలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా అని సూటిగా ప్రశ్నించింది. జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్న అడ్వొకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? ఆదేశాలు ఇవ్వమంటా రా? అని హైకోర్టు ప్రశ్నించింది. 48 గంటల్లో ప్రభుత్వం లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పై నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే తాము ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హైకోర్టు తేల్చి చెప్పింది

Tags:    

Similar News