బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగని కరోనా.. భారీగా పెరిగిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఈరోజు 9,748 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో [more]

;

Update: 2020-08-04 14:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఈరోజు 9,748 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,333 కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 1,604 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 79,104 యాక్టివ్ కేసులున్నాయి. 96, 625 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ఈరోజు అత్యధికంగా 1,372 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News