ఏపీలో ఆగని వైరస్… ఒక్కరోజే రికార్డుస్థాయిలో మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా మొత్తం 1919 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రికార్డు స్థాయిలో ఒకేరోజు 37 మంది మృతి [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా మొత్తం 1919 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రికార్డు స్థాయిలో ఒకేరోజు 37 మంది మృతి [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా మొత్తం 1919 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రికార్డు స్థాయిలో ఒకేరోజు 37 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,103కు చేరుకుంది. ఇప్పటివరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 16,464 గా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 14,274గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 365 మంది మరణించారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.