బ్రేకింగ్ : ఏపీ హెల్త్ బులిటెన్ విడుదల … ఈ ఒక్కరోజే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో 961 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పరీక్షల్లో వెల్లడయింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో 961 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పరీక్షల్లో వెల్లడయింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో 961 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పరీక్షల్లో వెల్లడయింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 18,550 కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 20,567 మందికి పరీక్షలు నిర్వహించగా 961 మందికి పాజిటివ్ గా తేలింది. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10,443 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 8,422 గా ఉంది. ఏపీ కరోనా టెస్ట్ ల నిర్వహణలో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ తర్వాత ఏపీలోనే అత్యధికంగా కరోనా టెస్ట్ లు జరుగుతున్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ 10.17 లక్షల మందికి టెస్ట్ లు నిర్వహించారు.