ఆంధ్రప్రదేశ్ ను వదలని కరోనా మహమ్మారి

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ను వదలడం లేదు. తాజాగా ఒక్కరోజే 443 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులోనే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో [more]

;

Update: 2020-06-22 12:39 GMT

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ ను వదలడం లేదు. తాజాగా ఒక్కరోజే 443 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులోనే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 9,372 మందికి కరోనా సోకింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 44 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. కరోనాతో ఏపీలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 111కు చేరుకుంది. ఇప్పటివరకూ 4,435 మంది కరోనా చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ కూడా కరోనాపై సమీక్ష నిర్వహించారు. 90 రోజుల్లో అందరికీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

Tags:    

Similar News