కారుకే సై అంటున్న సీపీఐ

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలంగాణ సీపీఐ అధికార పార్టీకే మద్దతు ఇచ్చేందుకు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఆ [more]

;

Update: 2019-10-01 09:54 GMT
వామపక్షాలు
  • whatsapp icon

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలంగాణ సీపీఐ అధికార పార్టీకే మద్దతు ఇచ్చేందుకు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఆ పార్టీ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని అధిష్టానానికి పంపిస్తామని, సాయంత్రం లోగా నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. ఏ నిర్ణయమైనా పార్టీకి కట్టుబడాల్సి ఉంటుందని చెప్పారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయడం లేదు. దీంతో అధికార పార్టీ టి.ఆర్.ఎస్, కాంగ్రెస్ పార్టీలు సీపీఐ మద్దతు కోరాయి. దీంతో సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఇవ్వాళ భేటీ అయ్యింది. మొత్తానికి సీపీఐ టి.ఆర్.ఎస్ కే మద్దతు ఇచ్చేలా సంకేతాలున్నాయి.

 

 

Tags:    

Similar News