జగన్ తో దగ్గుబాటి భేటీ ఎందుకు…?

చంద్రబాబునాయుడు తోడల్లుడు, ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అధినేత జగన్ తో కలవడం చర్చనీయాంశమైంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈరోజు తన కుమారుడు హితేశ్ తో [more]

;

Update: 2019-01-27 12:10 GMT

చంద్రబాబునాయుడు తోడల్లుడు, ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అధినేత జగన్ తో కలవడం చర్చనీయాంశమైంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈరోజు తన కుమారుడు హితేశ్ తో కలసి జగన్ ను కలవడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ జగన్ తో కలసి హితేశ్ పనిచేస్తారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పడం విశేషం. జగన్ పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పనితీరు గాడి తప్పిందన్నారు. ప్రజల సొమ్మును వెచ్చించి చంద్రబాబు దీక్షలు చేస్తున్నారని, దీనిని ప్రజలు క్షమించరన్నారు. అయితే పురంద్రీశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతారని దగ్గుబాటి చెప్పడం విశేషం.

Tags:    

Similar News