వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యత…ఎవరు అనుమతిచ్చారు?
ఎల్జీ పరిశ్రమకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే విశాఖలో గ్యాస్ లీక్ జరిగిందన్నారు. వైసీపీ [more]
ఎల్జీ పరిశ్రమకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే విశాఖలో గ్యాస్ లీక్ జరిగిందన్నారు. వైసీపీ [more]
ఎల్జీ పరిశ్రమకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే విశాఖలో గ్యాస్ లీక్ జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలా అనుమతిచ్చిందన్నారు. లాక్ డౌన్ తర్వాత తిరిగి పరిశ్రమను ప్రారంభిచడానికి సహకరించిన పెద్దలు ఎవరో చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ప్రాణాంతక వాయువును వదలి పెట్టిన ఎల్జీ పాలిమర్స్ పెట్టిన కేసులు సరిపోతాయా? అని దేవినేని ఉమ నిలదీశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అత్యన్నత విచారణ కోరాలని ఆయన అన్నారు.