లాక్ డౌన్ లో సీజ్ చేసిన వాహనాలను తీసుకోవాలంటే?
లాక్ డౌన్ సమయంలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు సంబంధించి మార్గదర్శకాలను డిజిపి కార్యాలయం విడుదల చేసింది. ఇప్పటివరకు కొన్ని లక్షల వాహనాలు కూడా అధికారులు సీజ్ [more]
లాక్ డౌన్ సమయంలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు సంబంధించి మార్గదర్శకాలను డిజిపి కార్యాలయం విడుదల చేసింది. ఇప్పటివరకు కొన్ని లక్షల వాహనాలు కూడా అధికారులు సీజ్ [more]
లాక్ డౌన్ సమయంలో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు సంబంధించి మార్గదర్శకాలను డిజిపి కార్యాలయం విడుదల చేసింది. ఇప్పటివరకు కొన్ని లక్షల వాహనాలు కూడా అధికారులు సీజ్ చేయడం జరిగింది. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటివరకు దాదాపు ఆరు లక్షల పైచిలుకు వాహనాలను తెలంగాణ రాష్ట్రంలో సీజ్ చేశారు.సీజ్ చేసిన వాహనాలు అన్నింటిని ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ తో పాటు పోలీసుల సంబంధించిన గ్రౌండ్లో పార్క్ చేయడం జరిగింది. అయితే చాలా వరకు వాహనాలు చెడిపోయే ప్రమాదం ఏర్పడింది. అయితే ఈ వాహనాలను అన్నింటినీ కూడా విడుదల చేయాలని పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఎం వీ యాక్ట్ లో ఏదైతే కేసు నమోదైన వారికి సంబంధించి ఫైన్ తో పాటుగా వారిపైన చార్జిషీట్ కూడా దాఖలు చేయాలని పేర్కొంది. దీనితోపాటుగా జరిమానా కూడా తీసుకోవాలని పేర్కొంది. మోటార్ సైకిల్ కి వెయ్యి రూపాయలు ,ఫోర్ వీలర్ ,ఆటో కి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేయాలని పేర్కొంది. దీనితో పాటుగా వ్యక్తిగత షూరీటీ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఇందులో క్రిమినల్ కేసులు , పోలీసులపై దాడులకు లేదంటే ఇతరత్రా సంఘటనకు పాల్పడిన వారిపై కూడా చార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ కార్యాలయం సర్కులర్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపట్నుంచి లాక్ డౌన్ లో సీజ్ చేయబడిన వాహనాలను విడుదల చేసే అవకాశం కనబడుతోంది.