ఈవీఎంలు పనిచేస్తున్నాయి.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

రాష్ట్రంలో ఈవీఎంలు బాగానే పనిచేస్తున్నాయని ఎన్నికల సంఘం సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈవీఎంలు పనిచేయడం లేదనే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు మొత్తం 45,920 [more]

Update: 2019-04-11 06:10 GMT

రాష్ట్రంలో ఈవీఎంలు బాగానే పనిచేస్తున్నాయని ఎన్నికల సంఘం సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈవీఎంలు పనిచేయడం లేదనే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు మొత్తం 45,920 ఈవీఎంలను వినియోగించామని, అందులో కేవలం 362 ఈవీఎంలలో మాత్రమే సాంకేతిక సమస్యలు వచ్చాయన్నారు. వాటిల్లోనూ 310 ఈవీఎంలలో సమస్యలు పరిష్కరించామని, మరో 52 చోట్ల కొత్త ఈవీఎంలు పెట్టామని తెలిపారు. ఈవీఎంలపై దుష్ప్రచారాన్ని నమ్మకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓ పార్టీ, ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ఈవీఎంలు పనిచేయడం లేదని పెద్ద ఎత్తున దుష్ప్రచారాన్ని చేస్తున్న సంగతి తేలిసిందే.

Tags:    

Similar News