Breaking : ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది.;

Update: 2023-03-08 03:22 GMT
Bharat Scouts and Guides commissioner, brs mlc kalvakuntla kavitha

Bharat Scouts and Guides commissioner, brs mlc kalvakuntla kavitha

  • whatsapp icon

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో పదోతేదీ హాజరు కావాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వేగం పెంచిన సీబీఐ, ఈడీలు వరసగా నోటీసులు ఇస్తున్నాయి. వరసగా అరెస్ట్‌లు చేస్తున్నాయి. నిన్న అరెస్టయిన హైదరాబాద్ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైను నేడు ఈడీ విచారించనుంది.

పదో తేదీ ఏంజరగబోతుంది?
ఇప్పటికే రామచంద్ర పిళ్లై అరెస్ట్ సందర్భంగా జారీ చేసిన ఛార్జిషీట్ లో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. తాను కవిత బినామీగా రామచంద్ర పిళ్లై పేర్కొన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కవితను ఈడీ విచారణకు రమ్మనడంపై బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కవితను సీబీఐ విచారణ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, సౌత్ గ్రూప్ కు లీడర్ గా కవిత వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
ధర్నా చేయడానికి...
అయితే పదోతేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కవిత ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈనేపథ్యంలో అదే రోజు విచారణకు రావాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేయడం కూడా చర్చనీయాంశమైంది. పదో తేదీన ఏం జరగబోతుందన్నది హాట్ టాపిక్ గా మారింది. రేపు కవిత ఢిల్లీ వెళతారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది,


Tags:    

Similar News