నా రాజీనామా ఆత్మగౌరవం కోసమే

టీఆర్ఎస్ తనకు బీఫారం ఇచ్చినా గెలిపించింది మాత్రం హుజూరాబాద్ ప్రజలని ఈటల రాజేందర్ అన్నారు. రాజీనామా చేయవద్దని తనకు కొందరు సూచించారన్నారు. అయితే తాను ఆత్మగౌరవం కోసమే [more]

Update: 2021-06-12 05:53 GMT

టీఆర్ఎస్ తనకు బీఫారం ఇచ్చినా గెలిపించింది మాత్రం హుజూరాబాద్ ప్రజలని ఈటల రాజేందర్ అన్నారు. రాజీనామా చేయవద్దని తనకు కొందరు సూచించారన్నారు. అయితే తాను ఆత్మగౌరవం కోసమే రాజీనామా చేస్తున్నానని ఈటల రాజేందర్ తెలిపారు. తనకు నిర్భందాలు, కేసులు కొత్త కాదన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు రాజీనామాలు చేయకుండానే మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే తాను అసెంబ్లీలో గర్జించానని చెప్పారు. సీఎం కేసీఆర్ దగ్గర వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. ఆయన నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారన్నారు. జరగబోయే సమరంలో హుజూరాబాద్ ప్రజలదే విజయమని ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన ఈటల రాజేందర్ తర్వాత స్పీకర్ కార్యాలయంలో తన రాజీనామా లేఖను సమర్పించారు.

Tags:    

Similar News