కావాలనే కొల్లు రవీంద్రను ఇరికించారు
కావాలనే కొల్లు రవీంద్రను టార్గెట్ చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. హత్య జరిగి ఐదు రోజుల తర్వాత కొల్లు రవీంద్ర పేరును ఎలా బయటకు [more]
కావాలనే కొల్లు రవీంద్రను టార్గెట్ చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. హత్య జరిగి ఐదు రోజుల తర్వాత కొల్లు రవీంద్ర పేరును ఎలా బయటకు [more]
కావాలనే కొల్లు రవీంద్రను టార్గెట్ చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. హత్య జరిగి ఐదు రోజుల తర్వాత కొల్లు రవీంద్ర పేరును ఎలా బయటకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. పేదలకు, బడుగులకు అండగా ఉండే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్రలపై కేసులు పెట్టి భయంతో టీడీపీ నేతలను లొంగదీసుకోవాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని ముగ్గురికి అప్పజెప్పి దోచుకునేందుకు తెరతీశారన్నారు. 21 రోజులుగా అచ్చెన్నాయుడిని వేధిస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. న్యాయవ్యవస్థను కూడా లెక్క చేయడం లేదన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఇప్పుడుజరిగినంత రాజ్యాంగ ఉల్లంఘనలు జరగలేదని దేవినేని ఉమ తెలిపారు.