కోర్టులో కేసు నెగ్గిన నోవాక్ జొకోవిచ్

టెన్నిస్ స్టార్ జొకోవిచ్ వీసాను రద్దు చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రద్దు చేసింది.

Update: 2022-01-10 08:38 GMT

సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ వీసాను రద్దు చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మెల్‌బోర్న్‌లోని ఫెడరల్ సర్క్యూట్ అండ్ ఫ్యామిలీ కోర్టు సోమవారం రద్దు చేసింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ నుండి తనకు మినహాయింపు లభించిందని పేర్కొంటూ ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం ఆస్ట్రేలియా వచ్చిన జొకోవిచ్ పెద్ద రచ్చనే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..!

వ్యాక్సిన్ తీసుకోక పోవడంతో....
ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో పాల్గొనడానికి మెల్‌బోర్న్‌లో అడుగు పెట్టిన సెర్బియా స్టార్‌ జొకోవిచ్ ను విమానాశ్రయంలోనే నిలిపివేశారు. క‌రోనా వ్యాక్సిన్ వేసుకోకపోవ‌డానికి గ‌ల స‌రైన కార‌ణాలు చూపించ‌లేద‌నే కార‌ణంతో అధికారులు జొకోవిచ్ వీసాను కూడా ర‌ద్దు చేశారు. వ‌రల్డ్ నంబ‌ర్ వ‌న్ ర్యాంక‌ర్‌ జొకోవిచ్ 8 గంట‌ల‌పాటు విమానాశ్ర‌యంలోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది.
మినహాయింపుతోనే....
జడ్జి ఆంథోనీ కెల్లీ జొకోవిచ్‌ను విడుదల చేయవలసిందిగా మరియు అతని పాస్‌పోర్ట్ మరియు ఇతర ప్రయాణ పత్రాలను అతనికి తిరిగి ఇవ్వవలసిందిగా ఆదేశించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు. జొకోవిచ్ వీసాను మళ్లీ రద్దు చేసేందుకు తన వ్యక్తిగత అధికారాన్ని వినియోగించుకునే హక్కును ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రికి కలిగి ఉన్నారని ఆస్ట్రేలియా ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కేసు విచారణలో, న్యాయమూర్తి కెల్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం జొకోవిచ్ మొత్తం సమాచారం అందించాడని అన్నారు. జొకోవిచ్ ఓ వైద్య సమస్య గురించి ఒక ప్రొఫెసర్, డాక్టర్‌కి తెలియజేశాడు. కాబట్టి నిబంధనల ప్రకారం సరిపోతుందని న్యాయమూర్తి తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే విషయానికి వస్తే, ముందస్తు మినహాయింపు పొందకపోతే అతను ఆస్ట్రేలియాకు వచ్చేవాడు కాదని జొకోవిచ్ న్యాయవాది స్పష్టం చేశారు.
ఈ ఆటగాడి పట్ల...
20 గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకున్న ఆటగాడి పట్ల ఆస్ట్రేలియా ఇలా ప్రవర్తించడంపై ప్రపంచ వ్యాప్తంగా పలు విమర్శలు వచ్చాయి. 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు మెల్‌బోర్న్ చేరుకున్న జొకోవిచ్ను ఆస్ట్రేలియా ప్రభుత్వం అడ్డుకుంది. వాక్సినేషన్ సర్టిఫికేట్ లేకపోవడంతో విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. అతని వీసా రద్దు చేసింది. స్వదేశమైన సెర్బియాకు వెళ్లాలంటూ ఆదేశించారు.


Tags:    

Similar News