Cold Winds : తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వణికిస్తున్న చలి.. తెలుగు రాష్ట్రాల్లో గజగజ
తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చలి తీవ్రత పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చలి తీవ్రత పెరిగింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జనం బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, ఏపీలోని విశాఖ ఏజెన్సీలో దారుణంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాలుష్యం కారణంగా గాలిలో నాణ్యత తగ్గిందని తెలిపింది.
రోడ్డు ప్రమాదాలు...
మంచుకారణంగా రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడింది. సీనియర్ సిటిజన్లు, దీర్ఘకాలిక రోగాలున్న వారు ఉదయం పూట బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చలి ఎక్కువగా ఉండటంతో గజగజ వణికిపోతున్నారు. ఉదయం పది గంటలయినా చలి తీవ్రత తగ్గడం లేదు. దీంతో ఉద్యోగులు కూడా విధులకు హాజరయ్యేందుకు ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు రోడ్ల మీదకు రావాలంటేనే జంకుతున్నారు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
వీరంతా....
చలితీవ్రతతో పాటు పొగమంచు కూడా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువ అవ్వడం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉదయం పది గంటల వరకూ ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని వాహనదారులకు సూచిస్తున్నారు. చలి తీవ్రతతో పాటు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. శ్వాసకోశ వ్యాధులున్న వారు బయటకు రాకపోవడమే బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. రాత్రి నుంచి ఉదయం పది గంటల వరకూ ఇలాంటి వాతావరణమే ఉంటుంది. సీనియర్ సిటిజన్లు, పిల్లలు మరియు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని పేర్కొంది.