వర్షాలు కాదు.. వరదలు రాకూడదన్నాను

షేక్ పెట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో తన ప్రమేయం ఏమీ లేదని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు.. దీనిపై తాను ఎవరితో మాట్లాడలేదన్నారు. తహసీల్దార్ [more]

Update: 2021-02-17 01:04 GMT

షేక్ పెట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో తన ప్రమేయం ఏమీ లేదని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు.. దీనిపై తాను ఎవరితో మాట్లాడలేదన్నారు. తహసీల్దార్ కూడా తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు అని మీడియాలో చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బదిలీ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవహారమని, అందులో తనకు ఎలాంటి పాత్ర లేదని మేయర్ విజయలక్ష్మి చెప్పారు. తాను వందేళ్లలో రాని వరదలు హైదరాబాద్ కు వచ్చాయని, అటువంటి వరదలు రాకూడదనే తాను ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పానని, కొందరు దానిని వక్రీకరించి హైదరాబాద్ లో వర్షాలు రాకూడదని అన్నట్లు ట్రోల్ చేస్తున్నారని విజయలక్ష్మి వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News