నయీం కేసులో నిజాలివేనా..?

నయీం చనిపోయి మూడేళ్లవుతున్నా అతని విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి . నాలుగు సంవత్సరాలుగా విచారణ చేస్తున్న స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఇప్పటివరకు ఏ విషయాన్ని [more]

Update: 2019-08-02 02:39 GMT

నయీం చనిపోయి మూడేళ్లవుతున్నా అతని విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి . నాలుగు సంవత్సరాలుగా విచారణ చేస్తున్న స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ఇప్పటివరకు ఏ విషయాన్ని తేల్చలేకపోయింది. వందలకొద్దీ కేసులు నమోదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది . నయీం తో సంబంధాలు ఉన్న వారి విషయాలు ఇప్పటికీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి తాజాగా ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసుకోవడం అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. నయీంతో అంటకాగిన వారి వివరాలు కావాలని ఆర్టీఐ చట్టం కిందదరఖాస్తు చేశారు దీంతో పోలీసులు దీంతో పూర్తి వివరాలను సదరు సంస్థ కు అందజేశారు. నయీం కేసు వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది.

నయీంతో అంటకాగి….

ఆర్టీఐ సమాచారం ప్రకారం నయీం కేసు లో 16 మంది టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు. 17 మంది పోలిసు అధికారుల పేర్లు ఉన్నాయి. నయీం కేసులో మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పేరు ఉంది. పలువురు మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఉన్నారు. నయీం కేసులో అడిషనల్‌ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, అమరేందర్‌రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌, సాయిమనోహర్‌రావు..
శ్రీనివాసరావు, ప్రకాష్‌రావు, వెంకటనర్సయ్య పేర్లు ఉన్నాయి. నయీం కేసులో పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. భువనగిరి కౌన్సిలర్‌ అబ్దుల్‌ నాజర్‌, మాజీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌ మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేష్‌ పేర్లు మాజీ సర్పంచ్‌ పింగల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ పేర్లు ఉన్నాయి. ఈ కేసులో వెల్దండ టీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ ఈశ్వరయ్య పేరు పొందుపరిచారు. మూడేళ్ళ క్రితం నయీం ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఎన్ కౌంటర్ తర్వాత సంచలన విషయాలు బయటికి వచ్చాయి. నయీం కేసును సీీబీఐకి అప్పగించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ డిమాండ్ చేసింది.

Tags:    

Similar News