నేను రెడీగానే ఉన్నా… నన్ను టార్గెట్ చేయండి

సీఐడీ అధికారులపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. తన స్నేహితుడు నలంద కిషోర్ ను పలకరించేందుకు గంటా సీఐడీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఆయనను [more]

Update: 2020-06-23 04:47 GMT

సీఐడీ అధికారులపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. తన స్నేహితుడు నలంద కిషోర్ ను పలకరించేందుకు గంటా సీఐడీ కార్యాలయానికి వచ్చారు. అయితే ఆయనను పోలీసులు అనుమతించలేదు. దీంతో గంటా ఇది సరైన విధానం కాదన్నారు. తనపై రాజకీయ కక్ష తీర్చుకోవాలనుకుంటే తనపైనే తీర్చుకోవాలన్నారు. తన సన్నిహితులను ఇబ్బందిపెట్టడమేంటని ప్రశ్నించారు. తాను దేనికైనా సిద్ధమని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇలా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను కేసులతో ఇబ్బంది పెట్టడం సరికాదని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. తనను టార్టెట్ చేయాలని తన సన్నిహితులను కాదన్నారు. నలంద కిషోర్ తనకు వచ్చిన మెసేజ్ లను మాత్రమే ఫార్వార్డ్ చేశారని, దేశద్రోహం చేయలేదని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News