ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన గోరంట్ల మాధవ్..!!
అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా వేధించడంపై హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్వచ్ఛంధ విరమణకు దరఖాస్తు చేసుకున్న [more]
అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా వేధించడంపై హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్వచ్ఛంధ విరమణకు దరఖాస్తు చేసుకున్న [more]
అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా వేధించడంపై హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్వచ్ఛంధ విరమణకు దరఖాస్తు చేసుకున్న మాధవ్‌ను సర్వీస్ నుంచి రిలీవ్ చేయాలని ఉత్తర్వులిచ్చినా అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. డీజీ ఏ.బి.వెంకటేశ్వరరావుతో పాటు కర్నూలు రేంజీ డిఐజి నాగేంద్ర కుమార్‌లపై మాధవ్ ఫిర్యాదు చేశారు. గోరంట్ల మాధవ్ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు పోలీసుల తీరును తప్పు పట్టారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తామన్నారు. మరోవైపు ఆలిండియా సర్వీసు అధికారులు పార్టీల సేవలో తరిస్తున్నారని., డీజీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని గోరంట్ల మాధవ్ చెబుతున్నారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు సమర్పించేందుకు వెళితే., డిఐజి తనను కలవకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.