బ్రేకింగ్ : ఏపీలో 25 జిల్లాలు కాదట…మరో జిల్లాకు కూడా
ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. ఏపీ మంత్రి వర్గ సమావేశంలో జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ [more]
;
ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. ఏపీ మంత్రి వర్గ సమావేశంలో జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ [more]
ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. ఏపీ మంత్రి వర్గ సమావేశంలో జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీకి చీఫ్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. గిరిజన ప్రాంతాలను ఒక జిల్లాగా చేయాలని మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. దీంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. జిల్లాల ఏర్పాటు, భౌగోళిక పరిస్థితులు, ఫీజుబులిటీ, ప్రజల పరంగా సమస్యలు వంటి వాటిపై ఈ అధ్యయన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంటుంది. మొత్తం రెండు గంటల పాటు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం సాగింది.