ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు?
ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ, పీజీ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉంది. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. [more]
;
ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ, పీజీ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉంది. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. [more]
ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ, పీజీ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉంది. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే డిగ్రీ, పీజీ పరీక్షలను కూడా రద్దు చేయాలని డిమాండ్ విన్పిస్తుంది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పరీక్షల నిర్వహణ కష్టమేనని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విద్యాశాఖపై సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో డిగ్రీ, పీజీ పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.