జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్.. హైకోర్టు క్లియరెన్స్

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయొచ్చంది.;

Update: 2021-11-30 06:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయవచ్చని పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీకి మార్గం సుగమమయింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.60 లక్షల మందికి జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించింది. అందులోనే ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టాలని భావించింది. ఇందుకోసం రాష్ట్రంలో భూసేకరణను ప్రభుత్వం చేసింది.

పిటీషన్లన్నీ...
అయితే కొందరు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పేదలకు ఇళ్ల స్థలాలను నిలిపేయాలంటూ సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనిపై నేడు విచారించిన డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయవచ్చని తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన 128 పిటీషన్లను ఉపసంహరించుకున్నారు.


Tags:    

Similar News