అడ్డం తిరిగిన అఖిలప్రియ భర్త

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఓ కేసు విషయమై వచ్చిన తన విధులకు ఆటంకం [more]

Update: 2019-10-08 14:41 GMT

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఓ కేసు విషయమై వచ్చిన తన విధులకు ఆటంకం కలిగించాడని ఆళ్లగడ్డ రూరల్ ఎస్ ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు కేసులకు సంబంధించి భార్గవ తప్పించుకొని తిరుగుతున్నాడు. హైదరాబాద్ లో భార్గవ ఉన్నట్లు గా పోలీసులు సమాచారం వచ్చింది. ఈ నేసథ్యంలోనే భార్గవ ను పట్టుకునేందుకు పోలీసులు హైదరాబాద్ వచ్చారు. భార్గవ రామ్ పై గచ్చిబౌలి పోలీస్ స్టేఫన్లో ఆళ్లగడ్డ ఎస్ ఐ రమేష్ కుమార్ కంప్లైంట్ చేశారు.

పట్టుకునేందుకు వచ్చిన……

ఆళ్లగడ్డ పీఎస్ లో భార్గవ పై రెండు కేసులు గతంలోనే నమోదయ్యాయి. క్రైమ్ నెంబర్ 161/2019, 162/2019 కేసులలో భార్గవ A1 ముద్దాయిగా వున్నాడు. ఆళ్లగడ్డ లోని క్రషర్ విషయంలో శివరామి రెడ్డికి, భార్గవ లకు మధ్య ఘర్షణ జరిగింది.ఈ నెల ఒకటిన భార్గవ్ పై ఆళ్లగడ్డ పీఎస్ లో ఐపీసీ సెక్షన్ 143, 427, 447, 307, 507 ల కింద కేసు నమోదయింది.అప్పటి నుండి తప్పించుకు తిరుగుతున్న భార్గవను పట్టుకునేందుకు గచ్చిబౌలి కి వచ్చిన ఆళ్లగడ్డ ఎస్ ఐ. నిన్న సాయంత్రం AP 21 CK 0222 నంబర్ గల బ్లాక్ ఫార్టునర్ కార్ లో డ్రైవ్ చేస్తూ కనపడిన భార్గవను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పీ పోలీసులను గుర్తించిన భార్గవ కారు ఆపకుండా వేగంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దారిలో వెళ్ళాడు. భార్గవ కారు ను ఆళ్లగడ్డ పోలీస్ బృందం ఫాలో అయింది. గచ్చిబౌలి లోని ఓక్ వుడ్ హోటల్ వద్ద భార్గవ కారును ఆపే ప్రయత్నం చేశారు పోలీసులు. కారు ఆపినట్లే ఆపి వేగంగా ఎస్ ఐ పైకి దూసుకెళ్లారు. .తమ విధులను ఆటంకపరచడం తో పాటు, కారు తో తనను ఢీకొట్టే ప్రయత్నం చేసాడని భార్గవ పై ఆళ్లగడ్డ ఎస్ ఐ. పిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 353, 336 సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేస్ నమోదు చేశారు.

Tags:    

Similar News