నవంబరు రెండో వారంలో గ్రేటర్ ఎన్నికలు

నవంబరు రెండో వారంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చే అవకాశముందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన ఈరోజు కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. రెండో వారంలో ఎప్పుడైనా [more]

Update: 2020-09-29 08:46 GMT

నవంబరు రెండో వారంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చే అవకాశముందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన ఈరోజు కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. రెండో వారంలో ఎప్పుడైనా గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నగరంలోని 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగా లేదని సర్వేలో తేలిందన్నారు. వారి పనితీరును మార్చుకోవాలని సూచించారు. కార్పొరేటర్లకు ఏమైనా సమస్యలుంటే సంబంధి ఎమ్మెల్యేలను కలవాలని కేటీఆర్ కోరారు.

Tags:    

Similar News