తొలి సినిమాలో హీరోగా.. తర్వాత విలన్ గా

1959లో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తెలుగు సినిమాలో నటించారు. హీరోగా ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు

Update: 2022-12-23 03:17 GMT

1959లో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తెలుగు సినిమాలో నటించారు. హీరోగా ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అనంతరం ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. గుడివాడ కళాశాలలో డిగ్రీ చదువుతూ సినీరంగంలోకి ప్రవేశించారు. దాదాపు 200 మంది డైరెక్టర్లతో పనిచేశారు. ఆయన నటించిన సినిమాలు మచ్చుకు కొన్ని. సినీ నిర్మాతగా కూడా ఆయన మారారు. నవరస నటనాసార్వభౌమ అని పేరు పొందారు. ఎస్వీ రంగారావు తర్వాత విలన్ గా ప్రేక్షకులను అలరించిన వారిలో కైకాల సత్యనారాయణ ఒకరు. మహర్షి ఆయన చివరిసరిగా నటించిన సినిమా.


సిపాయి కూతురు (1959) (తొలి సినిమా)
లవకుశ (1963)
పాండవ వనవాసం (1965)
పరమానందయ్య శిష్యుల కథ (1966)
ప్రేమనగర్ (1971)
తాత మనవడు (1973)
నిప్పులాంటి మనిషి (1974)
జీవన జ్యోతి (1975)
సిరిసిరిమువ్వ (1976)
సెక్రటరీ (1976)
చక్రధారి (1977)
దాన వీర శూర కర్ణ (1977)
యమగోల (1977)
శుభలేఖ (1982)
శ్రుతిలయలు (1987)
రుద్రవీణ (1988)
నారీ నారీ నడుమ మురారి (1990)
సూత్రధారులు (1990)
గ్యాంగ్ లీడర్ (1991)
భైరవ ద్వీపం (1994)
ముద్దుల ప్రియుడు (1994)
యమలీల (1994)
ఘటోత్కచుడు (1995)-
సాహసవీరుడు - సాగరకన్య (1996)
సూర్యవంశం (1998)
శుభాకాంక్షలు (1998)
సమరసింహారెడ్డి (1999)
మురారి (2001)
అరుంధతి (2009)
నవరసనటనా సార్వభౌమ సత్యనారాయణకు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. ఆయన స్క్రీన్ మీదకు వస్తే వెండితెర నిండుగా ఉంటుందని అంటారు. విలన్ గా మాత్రమే కాకుండా హాస్యరసాన్ని కూడా పోషించిన కైకాల సత్యనారాయణకు తెలుగు నాటఎందరో అభిమానులున్నారు. ఆయనకు లభించిన అవార్డుల్లో మచ్చుకు కొన్ని

జీవితకాల సాఫల్య పురస్కారం (2017)
నంది అవార్డులు
ఉత్తమ చలన చిత్రం - బంగారు కుటుంబం (1994)
రఘుపతి వెంకయ్య అవార్డు - 2011


Tags:    

Similar News