ఇండియా దే విక్టరీ.. టెన్షన్ మధ్య

భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య టీ 20 మ్యాచ్ లో చివరకు విజయం భారత్ దే అయింది. ఉత్కంఠత మధ్య ఇండియా విజయం సాధించింది

Update: 2022-11-02 12:30 GMT

భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య టీ 20 మ్యాచ్ లో చివరకు విజయం భారత్ దే అయింది. ఉత్కంఠత మధ్య ఇండియా విజయం సాధించింది. ఐదు పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య కొనసాగింది. దీంతో టీ 20 వరల్డ్ కప్ లో భారత్ ఆరు పాయింట్లకు చేరుకుని అగ్రస్థానంలో ఉంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటర్లు అత్యధిక పరుగులు చేసి బంగ్లాదేశ్ ముందు 184 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. విరాట్ కొహ్లి 64, కెఎల్ రాహుల్ 50, సూర్య కుమార్ యాదవ్ 30పరుగులు చేశాడు.

ఓపెనర్లు ధాటిగా...
అయితే బంాగ్లాదేశ్ ఓపెనర్లు ధాటిగా ఆడటంతో ఒక దశలో బంగ్లాదేశ్ సునాయాసంగా విజయం సాధిస్తుందని భావించారు. కానీ వర్షం పడటంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్ ను 16 ఓవర్లకు కుదించారు. దీంతో 150 పరుగులు 16 ఓవర్లలో చేయాల్సి వచ్చింది. చివరి ఓవర్ వేసిన అర్హదీప్ బౌలింగ్ లో ఒక బాల్ ను సిక్సర్ కొట్టడంతో బంగ్లాదే విజయం అనుకున్నారు. కానీ తర్వాత బాల్స్ ను పొదుపుగా వేయడంతో బంగ్లాదేశ్ కు పరాజయం తప్పలేదు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ కొహ్లి ఎంపికయ్యారు.


Tags:    

Similar News