గన్ మెన్లను వెనక్కు పంపిన జేసీ

Update: 2018-09-17 02:00 GMT

తాడిపత్రి కి సమీపంలోని పెద్దపొలమడ గ్రామంలోని ఒక ఆశ్రమం విషయంలో వివాదం తారాస్థాయికి చేరుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా చెలరేగిన అల్లర్లు ఒక వ్యక్తిని పొట్టనపెట్టుకున్నాయి. ప్రభోదానంద ఆశ్రమానికి చెందిన భక్తులు దాడి చేయగా ఒక వ్యక్తి మృతి చెందడంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అక్కడకు చేరుకుని ఆశ్రమంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను బలవంతంగా జీపులోకి ఎక్కించి తాడిపత్రికి తీసుకువచ్చారు. దీంతో పోలీసులు తన పట్ల అనుసరించిన వైఖరికి నిరసనగా జేసీ దివాకర్ రెడ్డి తన అనుచరులతో తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. తన గన్ మెన్లను కూడా వెనక్కు పంపించారు. ఈ అల్లర్లను అదుపు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.

Similar News