ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. నిందితుడు శ్రీనివాస్ రావును రెండో రోజు విచారిస్తున్నారు. జగన్ పై దాడి జరపడానికి కారణం ఏంటని తెలుసుకునే దిశగా విచారణ జరుగుతోంది. విశాఖ సీపీ నడ్డా ప్రత్యక్షంగా విచారణలో పాల్గొంటున్నారు. మరోవైపు శ్రీనివాసరావుకు ఎస్బీఐ, ఆంధ్రా, విజయ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఖాతాల్లో ఏవైనా పెద్దఎత్తున లావాదేవీలు జరిగాయా అనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఇక ఏడాదిలో సుమారు 10 వేల కాల్స్ నిందితుడు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కాల్ లిస్టుపై కూడా పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. ఇక నిందితుడి జేబులో దొరికిన లేఖ రాసిన రేవతీపతి, విజయదుర్గలను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.