జగన్ పిటిషన్ లో ఏముందంటే...?

Update: 2018-10-31 11:46 GMT

విశాఖ ఎయిర్ పోర్ట్ లో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల ధర్యాప్తం పక్షపాతంగా సాగుతున్నందున స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని ఆయన పిటీషన్ లో ప్రధానంగా కోరారు. జగన్ పిటీషన్ లోని ముఖ్యాంశాలు...

- ప్రతివాదులుగా ఏపి హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ డీజీపీ, నార్త్ వైజాగ్ ఏసీపీ, వైజాగ్ ఎయిర్ పోర్ట్ ఇన్స్పెక్టర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ డీజీపీ.

- ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే నాపై కుట్ర పన్ని అంతం చేయాలని అనుకున్నారు.

- ప్రజా సంకల్ప యాత్ర లో నాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకె ఈ దాడి చేయించారు.

- అక్టోబర్ 25న వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో నాతో సెల్ఫీ దిగుతానని వచ్చి ఓ వ్యక్తి దాడి చేశాడు. నా గొంతుపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో భుజానికి గాయం అయ్యింది.

- ఏపీ డీజీపీ, ఏపీ హోం శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ కనుసన్నల్లోనే సిట్ విచారణ జరగుతుంది. కావున స్వతంత్ర సంస్థతో థర్డ్ పార్టీ విచారణ జరిపించాలి.

- నేను ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఏపీ పోలీసులు నా వాంగ్మూలం తీసుకోవడానికి వచ్చారు. నేను నిరాకరించాను.

- దాడి జరిగిన కొన్ని గంటల్లోనే డీజీపీ, మంత్రులు, సీఎం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనుమానాలకు దారితీస్తుది.

- దాడి జరిగిన అనంతరం ఫ్లెక్సీలు తెరమీదకు తెచ్చారు. దాడికి కారణయిన శ్రీనివాస్ వద్ద లభ్యం అయిన లేఖలో మూడు చేతి రాతలు ఉన్నాయి.

- రిమాండ్ రిపోర్ట్ లో నా పై హత్యాయత్నం జరిగిందని స్వయంగా పోలీసులే పేర్కొన్నారు.

- ఏపీ ప్రభుత్వం ఆధీనంలో లేని సంస్థ చేత ఈ ఘటనపై విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

Similar News