మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం ప్రసాదరావు కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చారు. ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈరోజు కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన జలగం ప్రసాదరావు గతకొన్నాళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జలగం ప్రసాదరావుపై ఆరేళ్ల క్రితం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ను ఇటీవలే కాంగ్రెస్ ఎత్తివేసింది. పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ప్రసాదరావుతో ఫోన్లో మాట్లాడి పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా కోరారు. అయితే జలగం ప్రసాదరావు ఉత్తమ్ ప్రతిపాదనను తిరస్కరించారు. మంత్రి కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు లు చర్చలు జరపడంతో ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయిపోయారు.