జగన్ ఇది పద్ధతి కాదు.. ఎంత సర్దుకుపోతున్నా?

తాను ఎంతగా సర్దుకు పోదామని చూస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం కవ్విస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న [more]

Update: 2020-05-12 04:08 GMT

తాను ఎంతగా సర్దుకు పోదామని చూస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం కవ్విస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 203ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కల్గిస్తే తాము న్యాయపోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని కేసీఆర్ అన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై కృష్ణా వాటర్ రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

Tags:    

Similar News