జగన్ అందుకే చేశారు
జగన్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగానే అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తాము రైతు బంధు [more]
జగన్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగానే అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తాము రైతు బంధు [more]
జగన్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగానే అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తాము రైతు బంధు పథకం కింద ఎన్ని ఎకరాలున్నా పెట్టుబడి ఇస్తున్నామని, మరి జగన్ ప్రభుత్వం ఇస్తుందా? అని కేసీఆర్ అన్నారు. ఏపీలో రైతు భరోసా కింద 12, 500లు మాత్రమే ఇస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు కేసీఆర్. ఇక్కడ ఉన్న 29 రకాల స్కీమ్ లు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వేరని, అక్కడి ప్రభుత్వ నిర్ణయాలు ఇక్కడ అమలు చేయడం, చేయకపోవడం తమ ఇష్టమని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్లాట్ ఫారం స్పీచ్ లు…..
రాజకీయ నాయకులు ప్లాట్ ఫారం స్పీచ్ లు మానుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టాన్నే తాను రాష్ట్రంలో అమలుపరుస్తున్నామన్నారు. బీజేపీ నేతలు కేంద్రాన్ని ఈ విషయంపై అడగాలన్నారు. మధ్యప్రదేశ్ లో ఆర్టీసీని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వమేనని, అప్పట్లో ఉమాభారతి రద్దు చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలు దీనిపై సమాధానం చెప్పాలన్నారు. ఆత్మహత్యలకు కారణం యూనియన్ నేతలు, విపక్షాలే కారణమన్నారు. బీజేపీవి శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయమన్నారు. ఎవరూ ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయలేరన్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు.
దివాలా తీయకూడదనే…..
నవంబరు 5వ తేదీ అర్థరాత్రి లోపు బేషరతుగా విధుల్లోకి హాజరు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆరో తేదీ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రయివేటు పర్మిట్లకు కూడా ఒక విధానం ఉంటుందన్నారు. యూనియన్లు పెట్టిన పనికిమాలిన డిమాండ్లతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్టీసీ దివాలా తీయకూడదనే ప్రయివేటు బస్సులకు రూట్లు ఇచ్చామన్నారు. ఆర్టీసీకి ఐదు వేల బస్సులు, ప్రయివేటు బస్సులు ఐదువేలు ఉంటాయన్నారు. ఆర్టీసీ 9వ షెడ్యూల్ లో ఉందని, ఎవరి కార్పొరేషన్ వాళ్లు మొదలు పెట్టుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. అవన్నీ తెలుసుకోకుండా ఇంకా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నామనడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఆర్టీసీ కార్మికులకు దానిపై ఎలాంటి హక్కు లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలని, లేకుంటే ఆర్టీసీ రహిత రాష్ట్రం తెలంగాణ అవుతుందని చెప్పారు.