కేసీఆర్ మరింత కఠిన చర్యలు

కరోనా నియంత్రణపై ప్రజలు సహకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఉన్నతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. జనసమూహంలోకి ప్రజలువెళ్లకపోవడమే మంచిదన్నారు. శ్రీరామనవమి, ఉగాది [more]

Update: 2020-03-19 14:09 GMT

కరోనా నియంత్రణపై ప్రజలు సహకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఉన్నతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. జనసమూహంలోకి ప్రజలువెళ్లకపోవడమే మంచిదన్నారు. శ్రీరామనవమి, ఉగాది ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకే ఈ వ్యాధి సోకిందని చెప్పారు. పదోతరగతి పరీక్షలు యధాతధంగా జరుగుతాయని, పరీక్షా కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం 18 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. తక్షణమే అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దు చేయాలని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ఆ యా జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని కోరారు. 1165 మందిని ఇప్పటి వరకూ హోంక్వారంటైన్ లో ఉంచామని చెప్పారు. ప్రజా రవాణాలో పరిశుభ్రత పాటించాలన్నారు. తెలంగాణలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫంక్షన్ హాళ్లన్నీ మూసివేయాలని కోరారు.

Tags:    

Similar News