ప్రముఖ హీరో కుటుంబంలో మరో విషాదం

ప్రముఖ కన్నడ సినీ నటుడు శక్తి ప్రసాద్ భార్య లక్ష్మీదేవి కన్నుమూశారు.;

Update: 2022-07-23 10:36 GMT

యాక్ష‌న్ కింగ్ అర్జున్ స‌ర్జా ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. అర్జున్ త‌ల్లి లక్ష్మి దేవ‌మ్మ క‌న్నుమూశారు. ఆమె వ‌య‌స్సు 85 సంవ‌త్స‌రాలు. గ‌త కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె బెంగ‌ళూరులోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో శ‌నివారం ఆమె తుదిశ్వాస విడిచారు. లక్ష్మి దేవ‌మ్మ మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. అర్జున్‌ను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. లక్ష్మీ దేవమ్మ మోసూరులోని ఓ స్కూల్‌ లో టీచర్‌ గా పనిచేశారు.

ప్రముఖ కన్నడ సినీ నటుడు శక్తి ప్రసాద్ భార్య లక్ష్మీదేవి కన్నుమూశారు. ఆమె గత నెల రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో సర్జా కుటుంబం అభివృద్ధిలో లక్ష్మీదేవి పాత్ర ఎంతో ఉంది. భర్త చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్న సమయంలో, పిల్లలను పోషించడంలో లక్ష్మీదేవి తనవంతు పాత్ర పోషించారు. సర్జా కుటుంబం గతేడాది చిరంజీవి సర్జాను కోల్పోయింది. ఇప్పుడు అర్జున్ త‌ల్లి లక్ష్మి దేవ‌మ్మ క‌న్నుమూశారు. అర్జున్ సర్జా ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. ధృవ సర్జా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉన్నారు.


Tags:    

Similar News