రెవెన్యూ ను సమూలంగా మారుస్తా

అన్ని ఎన్నికలు పూర్తయినందున ఇక తాము మ్యానిఫేస్టోలో పొందుపర్చిన అంశాలపై దృష్టి పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛను రెండు [more]

Update: 2020-01-25 12:46 GMT

అన్ని ఎన్నికలు పూర్తయినందున ఇక తాము మ్యానిఫేస్టోలో పొందుపర్చిన అంశాలపై దృష్టి పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పింఛను రెండు వేలకు పెంచుతామని చెప్పారు. ప్రభుత్వోద్యోగుల వయోపరిమితిన 60 ఏళ్లకు పెంచబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఐటీ రంగం బాగా విస్తరించబోతుందన్నారు. కేంద్రం నుంచి సరైన సహకారం లభించడం లేదని కేసీఆర్ అన్నారు. పట్టణీకరణ రోజురోజుకూ పెరుగుతుందన్నారు. పట్టణ ప్రాంత నేతలు అప్ డేట్ కావాలన్నారు. అందుకోసం సెంటర్ ఫర్ అర్బన్ ఎక్సెలెన్సీ ఏర్పాటు చేస్తున్నామని, దీని కోసం హైదరాబాద్ లో 20 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. అర్బనైజేషన్ కు అనుకూలంగా ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. నైతిక విలువలను పాఠ్యాంశంగా ప్రవేశపెడతామన్నారు. అవినీతిలో అగ్రభాగాన నిలిచిన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. దీనికి సర్జరీ అవసరమని చెప్పారు. తాను దేనికీ భయపడనని చెప్పారు. ప్రజలకు మంచి చేసేలా పని చేయాలన్నారు. రెవెన్యూ శాఖను ఏ విధంగా తీర్చిదిద్దాలో నిర్ణయిస్తామన్నారు. న్యూ రెవెన్యూ యాక్ట్ వచ్చే శాసనసభలో ప్రవేశపెడతామని, దీనిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని కూడా తెస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News