కాంగ్రెస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు
కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కనుమరుగై పోతున్నా ఇంకా ఆ పార్టీనేతల్లో మార్పు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై కేసీఆర్ [more]
కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కనుమరుగై పోతున్నా ఇంకా ఆ పార్టీనేతల్లో మార్పు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై కేసీఆర్ [more]
కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కనుమరుగై పోతున్నా ఇంకా ఆ పార్టీనేతల్లో మార్పు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఎవరికీ నాడు నమ్మకం లేదన్నారు. అయినా తన ప్రయత్నాన్ని ఏనాడు ఆపలేదని, నిరుత్సాహ పడలేదని, అనేక పోరాటాలు చేశామని, అవమానాలు, అవహేళనలకు గురయ్యామని చెప్పారు. తాను పార్టీని చీల్చే కార్యక్రమాన్ని కూడా పాల్పడ్డారన్నారు. ఆనాడు తాను ఏమాత్రం వెనకడుగు వేసినా ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదన్నారు. సభలో కాంగ్రెస్ సభ్యుల వైఖరి సరిగా లేదన్నారు. వాళ్ల ఓపిక రోజురోజుకూ దిగజారిపోతుందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. సభలో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. అసత్య ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధగా అభివృద్ధి చెందిందో తాను ప్రత్యేకంగా చెప్పనక్కర లేదన్నారు. ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వారు పాలిస్తారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ఏర్పాటు విఫలప్రయోగమని నిరూపించాలని ఏపీ నేతలు కొందరు చేశారన్నారు. ప్రభుత్వ పనితీరు ఎన్నికల ఫలితాలే చెప్పాయని కేసీఆర్ అన్నారు. జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ దే విజయమని, ఈ ఫలితాలు ఏం చెబుతున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు.