తెలంగాణలో అన్నీ బంద్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైలెవెల్ కమిటీతో చర్చించిన కేసీఆర్ కరోనా వైరస్ పై తెలంగాణలో హై అలెర్ట్ ప్రకటించారు. తెలంగాణలో స్కూళ్లు, కళాశాలను [more]

Update: 2020-03-14 11:24 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైలెవెల్ కమిటీతో చర్చించిన కేసీఆర్ కరోనా వైరస్ పై తెలంగాణలో హై అలెర్ట్ ప్రకటించారు. తెలంగాణలో స్కూళ్లు, కళాశాలను ఈ నెల 31వ తేదీ వరకూ బంద్ చేయాలని నిర్ణయించారు. అయితే షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. సినిమా హాళ్ల ను కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. విద్యాసంస్థలన్నీ ఈ నెల 31వ తేదీ వరకూ మూసివేయాలని భావిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని సూచించనున్నారు. రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ ను కూడా బంద్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. శాసనసభ సమావేశాలను కూడా కుదించనున్నారు. సోమవారం సమావేశాన్ని వాయిదా వేయనున్నారు.

Tags:    

Similar News