బ్రేకింగ్ : 24 గంటల జనతా కర్ఫ్యూ… కేసీఆర్ నిర్ణయం

రేపు జనతా కర్ఫ్యూ లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం [more]

Update: 2020-03-21 10:05 GMT

రేపు జనతా కర్ఫ్యూ లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూను తెలంగాణలో పాటించాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. 24 గంటలు స్వీయ నిర్భంధంలో ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సులను కూడా బంద్ చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల బస్సులను కూడా రాష్ట్రంలోకి రావివ్వమని కేసీఆర్ తెలిపారు. అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయన్నారు. మెట్రో రైళ్లను కూడా బంద్ చేస్తామని తెలిపారు. వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాలు ఎవరికి వారే స్వచ్ఛందంగా బంద్ చేసుకోవాలన్నారు. ఎవరూ బయటకు రాకుండా తమకు తాము స్వచ్ఛందంగా స్వీయ నిర్భంధం చేసుకోవాలన్నారు. ఇది దేశం కోసమేనని ఆయన చెప్పారు.

ఇప్పటి వరకూ 21 మందికి పాజిటివ్….

ఇప్పటి వరకూ 20 వేల మంది వరకూ విదేశాల నుంచి వచ్చినట్లు కనుగొన్నామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని ఆయన తెలిపారు. 52 అంతరాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేశామన్నారు. 78 మంది జాయింట్ ఇన్స్ పెక్షన్న టీంలు ఏర్పాటు చేశామన్నారు. కరోనాపై ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయిందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారిమీద సీరియస్ గా దృష్టి పెడుతున్నామని చెప్పారు. సమాజహితం కోరి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వం చెప్పినట్లు చేయాలన్నారు. ఆరోగ్య శాఖమంత్రి ఆధ్వర్యంలో ఐదుగురితో కూడిన నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున బోర్డర్ ను క్లోజ్ చేసే ఆలోచన కూడా ఉందని కేసీఆర్ తెలిపారు. పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారు రెండు, మూడు వారాలు బయటకు రావద్దని సూచించారు.

Tags:    

Similar News