బ్రేకింగ్ ; ఏప్రిల్ 15వ తేదీ వరకూ లాక్ డౌన్

ఏప్రిల్ 15వ తేదీ వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 59 కరోనా పాజిటివ్ కేసులు [more]

Update: 2020-03-27 11:40 GMT

ఏప్రిల్ 15వ తేదీ వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 59 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు తెలిపారు. ఈ ఒక్కరోజే పది పాజిటివ్ కేసులు వచ్చాయన్నరాు. ఇరవై ఐదు వేల మంది క్వారంటైన్ లో ఉన్నారన్నారు. ఇవాళ ఉదయం ప్రధాని మోడీతో తాను మాట్లాడానని, రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని అందిస్తానని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. కరోనా లాక్ డౌన్, కర్ఫ్యూను యధాతధంగా పొడిగిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. అరవై వేల మంది వ్యాధికి గురైనా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఉన్న పేద వారి ఆకలిని తీర్చేందుకు ఎంత ఖర్చయినా పెడతామని కేసీఆర్ తెలిపారు.

సోషల్ డిస్టెన్స్ పాటించడమే….

దీనికి సోషల్ డిస్టెన్స్ పాటించడమే మందు అని కేసీఆర్ తెలిపారు. అమెరికా, స్పెయిన్ దేశాల్లో లాగా వ్యాధి ప్రబలితే మనదేశంలో 20 కోట్ల మంది జబ్బున పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారన్ని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకలతో ప్రత్యేక ఆసుపత్రిని సిద్ధం చేస్తామని చెప్పారు. డాక్టర్లు, ఇతర సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారని కేసీఆర్ తెలిపారు. ఏమవుతుంది అని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పశుగ్రాసం తరలింపుకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. సి విటమిన్లు లభించే పండ్లు తినమని చెప్పారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతులు పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. మక్కలు, వరిధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. వ్యవసాయశాఖ మార్కెట్లన్నీ బంద్ చేస్తున్నామని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కరోనాతో అమెరికా లాంటి దేశమే ఆగమయిందని చెప్పారు. అంతర్జాతీయంగా వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువని, విమానాశ్రాయాలు మూసివేసినందున ఆ బెంగ లేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలోనే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని, ఎంత కఠోర పరిస్థితినైనా ఎదుర్కొంటామని చెప్పారు.

Tags:    

Similar News