కేసీఆర్ హింట్ ఇచ్చారు.. వారికి కోత తప్పదా?
తెలంగాణ ప్రభుత్వ ఆదాయం లాక్ డౌన్ తో పూర్తిగా పడిపోయింది. లాక్ డౌన్ ప్రభుత్వ ఆదాయం 12 వేల కోట్లు ఈ నెల ఖజానాకు చేరాల్సి ఉండగా [more]
తెలంగాణ ప్రభుత్వ ఆదాయం లాక్ డౌన్ తో పూర్తిగా పడిపోయింది. లాక్ డౌన్ ప్రభుత్వ ఆదాయం 12 వేల కోట్లు ఈ నెల ఖజానాకు చేరాల్సి ఉండగా [more]
తెలంగాణ ప్రభుత్వ ఆదాయం లాక్ డౌన్ తో పూర్తిగా పడిపోయింది. లాక్ డౌన్ ప్రభుత్వ ఆదాయం 12 వేల కోట్లు ఈ నెల ఖజానాకు చేరాల్సి ఉండగా రాలేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించడంపై దిగులు పట్టుకుంది. జీతాల చెల్లింపు కష్టసాధ్యమవుతుందేమోనన్న ఆందోళన ఆయనే వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధించే అవకాశముందని కూడా హింట్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జీత భత్యాలను ఈ నెల నిలిపేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు ఆయన చెప్పకనే చెప్పారు. మరోవైపు కరోనా విపత్తుకు ఖర్చు చేయాల్సి రావడం, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండటంతో కేసీఆర్ ప్రభుత్వం అప్పు వైపు చూడక తప్పేట్లు లేదు.