బ్రేకింగ్ : ఏప్రిల్ 30 వ తేదీ వరకూ లాక్ డౌన్
తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటవ్ కేసుల సంఖ్య 503కు చేరుకుందన్నారు. 14 మంది [more]
తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటవ్ కేసుల సంఖ్య 503కు చేరుకుందన్నారు. 14 మంది [more]
తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటవ్ కేసుల సంఖ్య 503కు చేరుకుందన్నారు. 14 మంది చనిపోయారు. 96 మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. యాక్టివ్ కేసులు 399 ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 243 కంటెంయిన్ మెంట్ ఏరియాలు గుర్తించామన్నారు. అక్కడ కఠిన నిబంధనలను అమలు పరుస్తున్నామని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారంతా క్షేమంగా బయటపడతామని చెప్పారు. కొత్త కేసులు రాకపోతే కరోనా నుంచి బయటపడతామని చెప్పారు. సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుందన్నారు. మర్కజ్ కు సంబంధించి ఇప్పటి వరకూ 1200 మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పారు.
అందరూ పాస్ అయినట్లే….
కఠినంగా ఉంటే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేమని చెప్పారు. ఏప్రిల్ 30వ తేదీ వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ను కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రజలు దీనికి అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏప్రిల్ 30వ తేదీ తర్వాత దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశముందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ పాస్ చేస్తునట్లు ప్రకటించారు. తొలిసారిగా రాష్ట్రంలో వస్తున్న పంటలను కాపాడుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఏప్రిల్ 15 వరకూ అన్ని ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇస్తామన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని ప్రధానికి పంపుతున్నానని కేసీఆర్ చెప్పారు.