ఆర్టీసీనే ముగుస్తుంది

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కాదని, ఆర్టీసీనే ముగుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. యూనియన్ నాయకులది అర్థం, పర్ధం లేని సమ్మెనని మండిపడ్డారు. యూనియన్లు తమ [more]

Update: 2019-10-24 11:31 GMT

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కాదని, ఆర్టీసీనే ముగుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. యూనియన్ నాయకులది అర్థం, పర్ధం లేని సమ్మెనని మండిపడ్డారు. యూనియన్లు తమ ఎన్నికల ముందు ప్రతి రెండు, మూడేళ్లకోసారి జరిపే సమ్మెనే ఇదని ఆగ్రహంవ్యక్తంచేశారు కేసీఆర్. గొంతెమ్మ కోర్కెలు పెట్టి ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఓట్లు రాబట్టే చిల్లరమల్లర రాజకీయ సమ్మెగా కేసీఆర్ అభివర్ణించారు. అద్దె బస్సులతో రోజుకు ఒక్క బస్సుకు రూ. 225 లాభం వస్తుందని, దీనివల్ల ప్రతి కిలోమీటరుకు 75పైసలు ఆర్టీసీకి లాభం వస్తుందన్నారు. అదే ఆర్టీసీ బస్సు నడిస్తే కిలో మీటరుకు రూ.13లు నష్టం వస్తుంది ఎందుకని ప్రశ్నించారు. ప్రైవేటు ట్రావెల్స్ కు లాభాలొస్తుంటే, ఆర్టీసీ బస్సులకే ఎందుకు లాభాలు రావడం లేదో అర్థం చేసుకోవాలన్నారు. తాను గతంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశానని ఆర్టీసీపై పూర్తి అవగాహన ఉందన్నారు కేసీఆర్.

 

Tags:    

Similar News