కోలగట్లకు బొత్స చెక్.. అసమ్మతిని రాజేసి…?

వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి పార్టీలోనే అసంతృప్తి మొదలయింది. విజయనగరానికి చెందిన వైసీపీ నేతలు కోలగట్లకు వ్యతిరేకంగా రహస్య సమావేశాన్ని నిర్వహించారు. తమను కోలగట్ల వీరభద్రస్వామి అణిచివేస్తున్నారని [more]

Update: 2021-02-25 00:46 GMT

వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి పార్టీలోనే అసంతృప్తి మొదలయింది. విజయనగరానికి చెందిన వైసీపీ నేతలు కోలగట్లకు వ్యతిరేకంగా రహస్య సమావేశాన్ని నిర్వహించారు. తమను కోలగట్ల వీరభద్రస్వామి అణిచివేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమపై బొత్స అనుచరులమన్న ముద్ర వేసి తమను దూరం పెడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ సమావేశం పార్టీలో చర్చనీయాంశమైంది. దాదాపు 35 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కోలగట్ల తమ అనుచరులకే బీఫారం లు ఇస్తున్నారని వారు ఆరోపించారు.

Tags:    

Similar News