కేసీఆర్ నీకు మానవత్వం ఉందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేశారని అన్నారు. కేసీఆర్ కు [more]

;

Update: 2021-05-16 01:39 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేశారని అన్నారు. కేసీఆర్ కు మానవత్వం లేదన్నారు. కరోనా ను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేరుస్తారని కేటీఆర్ ను ప్రజలు నిలదీస్తున్నా పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఇకనైనా డ్రామాలు ఆపి కరోనా నుంచి ప్రజలను కాపాడాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.

Tags:    

Similar News