టీడీపీ నేత అరెస్ట్ కు రంగం సిద్ధం

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేసు నమోదయింది. కూన రవికుమార్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కూన రవికుమార్ ప్రభుత్వ అధికారిని దూషిస్తూ [more]

Update: 2020-03-02 08:41 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేసు నమోదయింది. కూన రవికుమార్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కూన రవికుమార్ ప్రభుత్వ అధికారిని దూషిస్తూ ఫోన్ లో బెదిరించిన సంఘటనపై ఆముదాల వలస పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. అయితే కూన రవికుమార్ ఆ అధికారి ఎవరో తనకు తెలియదని చెప్పారు. తమ్మినేని సీతారాం తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ్మినేనిని బట్టలూడదీసి జనం తంతారని కూనరవికుమార్ పేర్కొన్నారు. అయితే అవినీతి అధికారులను తాను నిలదీస్తానని చెప్పారు. ఎప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తమ్మినేని రేపు అండగా నిలబడరన్న విషయాన్ని తనపై కేసులు పెడుతున్న ప్రభుత్వోద్యోగులు గుర్తుంచుకోవాలన్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారంటూ కూన రవికుమార్ ఆముదాల పోలస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News