టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ నగరంలో అగ్ని..... ప్రమాదం తెలంగాణలో యాక్టివ్ కేసులు ఎన్నంటే? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు

Update: 2023-12-27 13:00 GMT

 latest telugu news

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Telangana : సంక్షేమ పథకాలు కావాలా? అయితే ఈ దరఖాస్తు పూర్తి చేయాల్సిందే

కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అందుకోవాలంటే ముందుగా దరఖాస్తును పూర్తి చేసి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా గ్రామసభలు జరగనున్నాయి. వీటికి ప్రజాపాలన అని నామకరణం చేశారు. అయితే రేపు అర్హులైన వారు సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈరోజు ప్రభుత్వం అప్లికేషన్ ఫారాన్ని విడుదల చేసింది.

Priyanka Jain : పెళ్లి అప్డేట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ..

మౌనరాగం, జానకి కలగనలేదు వంటి తెలుగు టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక జైన్.. ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్ 7లో కాంటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇక హౌస్ లో ఉన్న సమయంలో ప్రియాంక తన ప్రియుడిని అందరికి పరిచయం చేసిన విషయం అందరికి తెలిసిందే.

Allagadda : ఆళ్లగడ్డలో టెన్షన్.. భూమా అఖిల అరెస్ట్‌కు

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ కు పోలీసులు ప్రయత్నించారు. . భవిస్యత్ గ్యారంటీ కార్యక్రమం కోసం భూమా అఖిలప్రియ అక్కడకు వెళుతున్నారు.

YSRCP : ఎన్నికల బరి నుంచి తప్పుకున్న మరో వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు తమకు టిక్కెట్ దక్కదని భావించి ఇతర పార్టీల వైపు చూస్తుండగా మరికొందరు మాత్రం స్వచ్ఛందంగానే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని ప్రకటిస్తున్నారు.

Diabetes Prevention Tips: మధుమేహం లేకుండా రక్తంలో చక్కెర పెరుగుతుందా?

శరీరం ఎనర్జిటిక్‌గా ఉండాలంటే చక్కెర కూడా చాలా ముఖ్యం. అయితే ఎక్కువ చక్కెర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. డయాబెటిక్ వ్యక్తులలో రక్తంలో చక్కెర స్థాయి పెరగడం తరచుగా కనిపిస్తుంది. ఎందుకంటే మధుమేహం కారణంగా ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి ప్రభావితమవుతుంది.

Revanth Reddy : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్, 2 lakh jobs

ఏడాదిలోపే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ వచ్చే ఏడాది డిసెంబరు 9 లోపు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఇందుకోసం క్యాలండర్ కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.

2023 Rewind : ఈ ఏడాది బాగా వినిపించిన తెలుగు సాంగ్స్ ఇవే..

ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలతో పాటు సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. మరి 2023లో తెలుగులో బాగా వినిపించిన సాంగ్స్ ఏంటో ఓ లుక్ వేసేయండి. జనవరి నెలలో మాట్లాడుకుంటే.. వీరసింహారెడ్డి సినిమాలోని 'జై బాలయ్య మాస్ యాంతం' మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసింది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

Rahul Gandhi : మణిపూర్ టు ముంబయి.. మరో యాత్రకు రాహుల్ రెడీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో సుదీర్ఘ యాత్రకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ఈ యాత్రను రాహుల్ గాంధీ చేపట్టనున్నారు. వచ్చే నెల 14వ తేదీన రాహుల్ గాంధీ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు.

Hyderabad : రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లో ఒక కట్టెల దుకాణంలో ఈ మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న సోఫాల ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఇళ్లలో నుంచి సిలిండర్లు తీసుకుని ప్రజలు బయటకు పరుగులు తీశారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

Revanth Reddy : కరెంట్ బిల్లులు కట్టాలా? వద్దా? రేవంతన్నా...?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు పదే పదే ఇప్పటికీ అందరి చెవుల్లో మారుమోగుతున్నాయి. అందులో విద్యుత్తు బిల్లులు ఒకటి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అందచేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది
















Tags:    

Similar News