లాక్ డౌన్ లోనూ లాడ్జీలు అందుకోసం?

హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని భర్త అక్రమ సంబంధాన్ని భార్య బయటపెట్టింది. . హైదరాబాద్ శివారు ప్రాంతంలోని మున్సిపాల్టీలో వైస్ చైర్మన్ గా పనిచేస్తున్న ఒక రాజకీయ నేతకు [more]

Update: 2020-05-10 00:57 GMT

హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని భర్త అక్రమ సంబంధాన్ని భార్య బయటపెట్టింది. . హైదరాబాద్ శివారు ప్రాంతంలోని మున్సిపాల్టీలో వైస్ చైర్మన్ గా పనిచేస్తున్న ఒక రాజకీయ నేతకు అదే ప్రాంతంలో ఉంటున్న ఒక మహిళ తో అక్రమ సంబంధం ఉంది. తన ప్రియురాలితో కలిసి ప్రతినిత్యం ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఈ విషయం భార్యకు తెలుసు. గత కొన్ని రోజుల నుంచి భర్త ఇంటికి రాకుండా బయటనే తిరుగుతున్నాడు. అయితే ఈ వ్యవహారం భార్య సీరియస్ గా తీసుకుంది. భర్త పైన కన్ను వేసింది. భర్త కదలికలను ఎప్పటికప్పుడు కి తెలుసుకుంటూ వచ్చింది. ఏకంగా భర్త పైనే స్పై ఆపరేషన్ నిర్వహించింది.

లాడ్జీలో దొరికిపోయి….

ఈ నేపథ్యంలోనే భర్త మిత్రుడికి వనస్థలిపురంలో ఒక లాడ్జ్ ఉంది. తన భర్త అతని ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లు గా సమాచారం వచ్చింది.దీంతో వెంటనే వనస్థలిపురం పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు వెళ్లి ఓయో లాడ్జ్ పై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసులకు ముగ్గురు అమ్మాయిలు తో పాటు ఆమెభర్తతో పాటు లాడ్జి యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నాళ్ల నుంచి కూడా ఈ రాజకీయ నాయకుడు తన ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాకుండా లాడ్జి యజమాని కూడా మరొక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇదే లాడ్జి లో మరొక అమ్మాయి ఉండడం తోటి మొత్తం ముగ్గురు అమ్మాయిల తో పాటు వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అక్రమ సంబంధాన్ని భార్య బయట పెట్టడం ఇప్పుడు సంచలనం రేకెత్తించింది. లాక్ డౌన్ సందర్భంగా ఎక్కడా కూడా లాడ్జి లకు, హోటళ్లకు అనుమతి లేదు.

Tags:    

Similar News