మే 5వ తేదీన మమత ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ఈ నెల 5వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. మమత బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ పక్షం తమ నేతగా ఎన్నుకుంది. [more]

Update: 2021-05-04 01:26 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ఈ నెల 5వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. మమత బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ శాసనసభ పక్షం తమ నేతగా ఎన్నుకుంది. దీంతో గవర్నర్ ను కలసి తన ప్రమాణ స్వీకారం గురించి మమత బెనర్జీ చర్చించనున్నారు. మమత బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నందిగ్రామ్ లో మమత బెనర్జీ ఓటమి పాలయినా ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది.

Tags:    

Similar News