మోడీకి షాక్ ఇచ్చిన మ‌మ‌తా బెన‌ర్జీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పేరు వింటేనే మండిప‌డుతున్న ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు. ఫాని తుఫానుతో న‌ష్ట‌పోయిన ఒడిశా, [more]

Update: 2019-05-06 06:43 GMT

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పేరు వింటేనే మండిప‌డుతున్న ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మ‌రో వివాదాస్ప‌ద నిర్ణ‌యం తీసుకున్నారు. ఫాని తుఫానుతో న‌ష్ట‌పోయిన ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌ల‌లో ప‌ర్య‌టించి ప‌రిస్థితిని స‌మీక్షించాల‌ని న‌రేంద్ర మోడీ భావించారు. అయితే, త‌మ రాష్ట్రంలో అధికారులంతా ఎన్నిక‌ల విధుల్లో బిజీగా ఉన్నార‌ని, ప్ర‌ధాని త‌మ రాష్ట్రానిఇక రావాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ పీఎంఓకు స‌మాచారం ఇచ్చారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు నిరాక‌రించ‌డం అంటే సంచ‌ల‌న నిర్ణ‌య‌మ‌నే చెప్పారు. ఇక‌, ఇవాళ ఒడిశాలో ప‌ర్య‌టించిన న‌రేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తో క‌లిసి తుఫాను న‌ష్టంపై స‌మీక్ష నిర్వ‌హించారు. తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే చేశారు. ఇప్ప‌టికే ఒడిశాకు 381 కోట్లు ఇచ్చామ‌ని, ఇప్పుడు మ‌రో వెయ్యి కోట్లు ఇస్తామ‌ని, ఒడిశాను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News