రఘురామపై వేటు పడటం ఖాయం
రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను వైసీపీ ఎంపీలు కలిశారు. ఎంపీ మార్గాని భరత్ ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘురామ [more]
;
రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను వైసీపీ ఎంపీలు కలిశారు. ఎంపీ మార్గాని భరత్ ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘురామ [more]
రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను వైసీపీ ఎంపీలు కలిశారు. ఎంపీ మార్గాని భరత్ ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మార్గాని భరత్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను స్పీకర్ కు సమర్పించామని మార్గాని భరత్ తెలిపారు. మరోసారి స్పీకర్ ను కలిసి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరామని చెప్పారు. వెంటనే రఘురామ కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. బీఫారం తీసుకున్న పార్టీపై ఆయన విమర్శలు చేస్తున్నారన్నారు.